శ్రీముఖి వల్లే నేను ఇండస్ట్రీలో ఉన్నాను!: యాంకర్ రవి

  • సీనియర్ నటుడు చలపతిరావు వ్యాఖ్యలను సమర్థించిన రవి
  • అలీతో సరదాగా కాసేపు షోలో వివరణ  
  • శ్రీముఖి ఇచ్చిన భరోసా లేకపోతే ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు
ఆమధ్య జరిగిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌ తరువాత టీవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని భావించానని యాంకర్ రవి తెలిపాడు. అయితే తానింకా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం శ్రీముఖి ఇచ్చిన ధైర్యమని రవి తెలిపాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్‌ లో స్త్రీలపై సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఆనాటి వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, ‘సూపర్ సర్’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. వారిద్దరిపై మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఆడియో సిస్టమ్ ప్రాబ్లమ్ కారణంగా ఆయనేమన్నారో అసలు తనకు వినిపించలేదని, అందుకే క్యాజువల్ గా అలా అనేశానని, ఆ తర్వాత వివవరణ ఇచ్చినా ఎవరూ వినలేదని రవి అన్నాడు.

 ఆ సమయంలో ఇంట్లో కూడా అమ్మ, నాన్న, చెల్లితో పాటు ఎక్కడికి వెళ్లినా అందరూ దీనిపైనే ప్రశ్నించేవారని, తన తండ్రి కూడా తన మాట నమ్మలేదని రవి చెప్పాడు. దీంతో ఆ టార్చర్ భరించలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు. అయితే అలాంటి సమయంలో తనకు శ్రీముఖి, సుమ, ప్రదీప్ అండగా నిలిచారని అన్నాడు. వారు ముగ్గురూ ఇలాంటి సిట్యుయేషన్‌ ను తాము కూడా ఫేస్ చేసినట్టు చెప్పారని అన్నాడు. ఇప్పుడెంత చెప్పినా ఎవరూ నమ్మరని అన్నాడు. ఆ రోజు శ్రీముఖి ఇచ్చిన భరోసా, సుమగారు ఇచ్చిన స్ట్రెంగ్త్ తనను ఇక్కడ ఇంకా ఉండేలా చేశాయని రవి తెలిపాడు.
Go Back to Shorts
anchor
ravi
suma
ali
srimukhi

More Telugu News